పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; పంచమాశ్వాసము

315


దూతకునెఱిఁగించి, త్రోవనేమఱక
యాతతగతి గంగనార్వురు దాటి
నడచుచో, నిద్రగానమిఁ జాలపెద్ద
[1] నడికినకుంతి నన్నను దోడివారి
భుజముల నఱకడంబున రెండురొండ్ల
గజలీల భీముఁడొక్కటధరియించి,
యుపపర్వతములతో నొకకొండవోలె
నుపపర్వతములెల్ల నురలఁ ద్రొక్కుచును,
గమనవేగంబునఁ గాళ్లఁబెనంగు
ద్రుమములు లతలును [2]దుమ్ముగా నడఁచె
సురభిధూమంబులు సురవిమానముల
బెరయ వహ్నియుఁగాల్చెఁ బెరిగియయ్యిండ్ల,
ఏవురుసుతులతో నిటనిషాదియును,
నావేశ్మకారుండు నయ్యింటిలోన
బావకశిఖలతో భస్మమైపడిన,
వేవేగఁ [3]బౌరులవ్విధమునీక్షించి:
కుంతియు నేవురుకొడుకులుఁ గాలి;
రంతంత నివెచూడుఁ డాఱుకుప్పలును;
జనలేక యిదె పురోచనుఁడునుగాలెఁ;
దనకుచ్చితం బేలతనుఁగాల్పకుండు!
నేమనియెఱిఁగింత మిదికరిపురికి!
నేమనిపలవింత మిమ్మహాత్ములకు!"
అనియేడ్చుచో, దూత యందఱఁగూడి
పనవ వచ్చినయట్లు భస్మంబుచొచ్చి,
వదలక యాబిలద్వారంబుఁ గప్పి,
విదురున కావార్త వినిపించెఁ బోయి.

  1. నడుకున
  2. ద్రుమముగా
  3. చారులువేగ (మూ)