పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; పంచమాశ్వాసము

313


విదురుఁడుపుత్తెంచె వేగుగానన్ను;
నిదె నేను ఖనకుఁడ నితరుఁడఁగాను.
దుర్యోధనునియాజ్ఞ దుర్మంత్రమెల్ల
నార్యపూజితుఁడైనన యతఁడు మున్నెఱిఁగి,
తెలువఁబుత్తెంచె నత్తెఱఁగెల్లవినుఁడు.
తలఁచి కృష్ణచతుర్దశినాఁటి రాత్రి (?)
లక్కయింట మహానలప్రయోగమునఁ
జిక్కించి, మిమ్ముహింసించు యత్నంబు
సేయ నంపించె నీశిల్ప[1]కారకుని;
నా యత్నమితఁడు సేయఁగనున్నవాఁడు.
చలమెవ్వరికి నేల! ‘చచ్చెడియంత
కలగన్నచోట మేల్కను' మనికలదు;
రం.”డనికొనిపోయి, రాత్రి యయ్యింట
గండిగా నొకచోట [2]ఖనకపుంగవుఁడు
విదురుండు చెప్పిన వెరవునఁ ద్రవ్వి,
యదియేరుపడకుండ నల్లనఁ గప్పి :
"యనలంబుదగులక యావల వెడలి
చన మీకునిదిత్రోవ జనపతులార! "
అని చెప్పి, వాఁడును నయ్యూరనుండఁ,
జనుదెంచెఁ గౌరవసంకేతదినము.
అప్పుడు కుంతి బ్రాహ్మణపురంధ్రులకుఁ
దప్పక దేవతార్థము కుడువఁబెట్ట
వంటలురుచులుగా వండించిపెట్ట,
మింట నొయ్యనజారి మిహిరుండు గ్రుంకె.
ఆయెడఁ గుంతికినాప్తురాలై న
బోయత యేవురుపుత్రులుఁ దానుఁ

  1. కారునకు
  2. ఘనిక (మూ )