పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; పంచమాశ్వాసము

291


'పాంచాలుఁదెత్తు నీపగదీర్తు' ననిన
సంచిత పుణ్యుఁ డీసత్యసంధుండు;
కారణంబున శిష్యగతినొందెఁగాని,
ఘోరాస్త్రవిద్య నాకొలఁది[1]వాఁడితఁడు.'
అనిచూపి నిలిపిన, నయ్యర్జునుండు
ధనువుతోడనెపుట్టెఁ దల్లికి ననఁగ,
నిరుగేల విలుగ్రాల, నిషుపరంపరలు
తొఱఁగించె నుప్పొంగుతోయధివోలె.
బాణపంజరములు బాణవర్షములు
బాణవేణిక లేయుబాగునుజూప,
'నెంతటఁబెట్టునో యీబాణమహిమ
కొంతవారింపఁడొకో! గురుఁ' డనుచు
సభికులు వెఱపు నాశ్చర్యంబునొంద,
నభినవంబుగఁ బార్థుఁడంత వెండియును
మిక్కిలియెండచే మేదినిగమర,
నొక్కటఁ బెక్కుసూర్యులఁ బొడిపించి,
పెలుచఁ గార్కొని వృష్టి పెద్దగా నుఱుమ
జలదాస్త్రమేసి యాసంభ్రమంబుడిపి,
యేయూఁతనిలువక యిలసంచలింప
వాయుబాణంబేసి వానవిప్పించి,
గరళధూమంబు లాకసమున నిండ
నురగాస్త్రమేసి యాయుబ్బు విప్పించి,
యురుతర పక్షవాయువు లుప్పతిల్ల
గరుడాస్త్రమేసి యాగర్వంబునణఁచె
దివ్యాస్త్రమహిమ లిత్తెఱఁగున మఱియు
నవ్యంబుగాఁజూపె నరులచూడ్కులకు.

  1. గాఁడితఁడు (మూ)