పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

292

ద్విపద భారతము


గడుసూక్ష్మకుండగు; ఘనుఁడగుఁ ; గానఁ
బడ[1]కుండు; నంతనేర్పడు నెల్లయెడల;
భూమిలోనణఁగు; నభోవీథిఁదోచు
సామాదిబహువేదసమ్మితుండగుచు.
సాయకమహిమ నీచందమానరుని
గోయనిపొగడిరి కొలువువారెల్ల .
కదిసి గాంధారికి గాంధారిపతికి
విదుర [2]సంజయులంతవినిపించి రెఱుగ.
ఇంద్రాదులకురానిహృదయానురాగ
మింద్రసుతునకుఁగల్గె నిలయెల్లఁ బొగడ.
అప్పుడు, ప్రలయ కాలాభ్రనిర్ఘోష
ముప్పొంగ రాధేయుఁ డొగి మల్లచఱచి,
యాసభాస్థలి నక్కడక్కడపఱచి
యోసరిల్లక నిల్చి యుగ్రగర్వమున
నుర్వీశ్వరులఁబల్కు : “నోహో! యితండు
సర్వాధికుఁడె! యింతసన్నుతించెదరు!
దీనిఁజెప్పఁగ నేల! దివ్యాస్త్రమహిమ
యేనును నొక్కింత యెఱిఁగియుండుదును.”
అని విల్లుమోపెట్టి యర్జునుకంటె
ననువొప్ప వివిధసాయకవిద్యచూపి,
తనపెద్దకొడుకని తలఁపులోఁగుంతి
యనురాగపరిపూర్తిమైఁ జూచుచుండఁ;
"గర్ణుండనేను భార్గవునిశిష్యుండ;
నిర్ణయింపుఁడు విద్యనేర్తునోలేదొ!
అయ్యర్జునుని బలుననఘునితోడి
కయ్యంబుగోరి యీకడకు వచ్చితిని;

  1. కుండ నంతనేర్పడ
  2. సంజయులకు వినిపించిరెరింగి. (మూ )