పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; చతుర్థాశ్వాసము

275


మనుచు.................................................
.................................................
దానును గురువుతో ధనువభ్యసింప
నానరేంద్రకుమారు లదియోర్వలేక :
"హీనజన్మున కేల యీమహావిద్య!
హానిపుట్టెడు వీని ననుపవే ద్రోణ!
సురలతో రాహువు సుధఁ ద్రోలవచ్చు"
కరణి వచ్చిన వీని గడపవే ద్రోణ! "
అనిన ద్రోణుఁడు వారియతులవాక్యములు
విని , బోయనీక్షించి వెరవొప్పఁ బలికె :
"వేదంబుసరి ధనుర్వేదంబు; దీని
రాదు చెప్పఁగను; గిరాతుండ వీవు;
కావున, నిది నేర్పఁగాఁజాల." ననిన,
భావించి యబ్బోయ వలికె నగ్గురుని :
“ నీరూపురచియించి, నిన్నాత్మనిలిపి,
యారయ విలువిద్యలభ్యసించెదను ;
ఇప్పుడనుజ్ఞయు నిమ్ము నా." కనిన,
నప్పుడనుజ్ఞయు నతఁడిచ్చి వేగ
ననఘుఁడై యబ్బోయ నర్థినంపుటయుఁ,
జనుదెంచి వాఁడొక్క శైలంబుపొంత
గురుమూర్తిమేనును గొమరొప్పఁ జేసి,
గరిడిలో విశ్వాసగతిఁ బ్రతిష్ఠించి,
దవ్వుల శిష్యుఁడై ధనువభ్యసింప,
నెవ్వరికంటె వాఁడెఱిఁగెను విద్య.
అటపల్కె నరుని నేకాంతంబ గురుఁడు :
"పటుతరశార్య, నీపై వేడ్క నాకు
నేపయ్యె; నాకోర్కి యెవ్వారుసేయ
నోపనితలఁపున నూరకుండినను,