పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

276

ద్విపద భారతము


నేను జేసెదనని యీవన్నమాట
యూనియున్నది నాకు నుల్లంబునందు.
నిక్కము, ధనువున నీకంటెనితరు
లెక్కుడులేకుండ నెఱిఁగింతువిద్య".
అని శీఘ్రసంధాన, మస్త్రకాలంబుఁ,
దనుదాఁకుశరములఁ దప్పించుననువు,
శత్రుని కోపప్రసాదచింతనము,
శత్రునివిలుఁ దేరు సమయించుననువు,
నందు నందఱకందఱైయుండు ననువు,
గొందిఁ గానఁగరాని గుఱి యేయుననువుఁ,
బొరిఁ బెక్కుముఖములై పోరాడుననువు,
.................................................
మొగ్గరంబులుచించి మోఁదిరాననువు,
నుగ్గుగా విఱిగియు నూల్కొనుననువు,
హల శూల ముసల ఖడ్గాదులఁ బెనఁగి
విలుఁ దేరు సమసినవేగసంధించు
ననువు లెవ్వరికంటె నతఁ డర్జునునకుఁ
బనివడి నేర్పె నభ్యాసకాలమున,
నరుఁడును గురుసూనునకు నీసువుట్ట
శరములు తనుదానె సాధించెఁ గొన్ని.
అదిచూచి యాచార్యుఁ డతనికేకతమ
పదరకయిట్లను : "భళిరె! నీవగుదు;
వతిరథశ్రేష్ఠుండవనవచ్చు నిన్ను;
 [1]జతచేసితివి కొంత చెప్పనివిద్య
ర;"మ్మని సకలమంత్రంబులు సెప్పె.
సమ్మోహనాస్త్రంబు, జలదసాయకము,

  1. జతముచేసితివి కొంతచప్పనివిద్య (మూ)