పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; చతుర్థాశ్వాసము

271


ధనగర్వమునఁజేసి ధర్మవాక్యములు
మొనసిపల్కఁగలేరు మూగలోయనఁగ;
విభవత్రిదోషంబు విననీదు చెవుల
నభినవశుభమూలమగు యుక్తకథలఁ;
బరికించి త్రొక్కరు బహుధనాపేక్ష
[1]సారహీనులువోలె సన్మార్గపథము;
రాజుల నటుగాన రాదునమ్మగను.
భూజనాధిపులన్న బొంకులపొత్తు;
అరయ దుర్గుణముల కట జన్మభూమి;
దురితంబులకుఁ బ్రోవదొలఁగ రెన్నఁడును;
వారలచరితలు వాక్రువ్వనేల!
దారిద్య్రమతి [2]కష్టవృత్తి;
కులజుఁడు, పూజ్యుండు, గుణనిధి, ఘనుఁడు
చెలువుం, డుదారుండు, శిష్టవర్తనుఁడు
కర్తయు, భోక్తయు, ఘనతత్వనిధియుఁ,
గీర్తనీయుఁడు, మంత్రి, కేవలప్రభుఁడు
ననఁజాలు జగమునందర్థవంతుండు.
జనులకు నాయర్థసంచయంబెడలి
కులమును విద్యయుఁ గోటిగల్గినను,
నలవున శూరత నధికుఁడై యున్న,
నెరవుమిక్కిలియైన, విత్తహీనుండు
పురణింప జనులచేఁ బూజ్యుడుగాఁడు'
అనునీతిమార్గంబు లవి శిష్టమయ్యె ;
ధనగర్వమునఁగాదె! దగిలి యీఘనుఁడు
అసమానమగుమైత్రి యాత్మఁ గైకొనక
వెస నన్నుఁ గీడాడి వెడలఁద్రోపించె !

  1. చేర
  2. కష్ణవృష్టి (మూ )