పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

270

ద్విపద భారతము


[1]"లేమిచే నెన్నఁడులేని దిచ్చటకు
గామించివచ్చితిఁ; గల్లచేసితిని;
వచ్చి యీతనిచేత వాసిపోవలసెఁ
జెచ్చర నేను జేసినకల్లవలన.
తలఁప, నిట్టిదకాదె! ధనహీనుఁడైన
దలిదండ్రులొల్లరు తనయునినైన.
ధనవంతుఁడైన నాతలివానినైన
వినయంబుఁ బ్రియముఁ గావింతురుప్రజలు.
“ధనము చుట్టఱికంబు; ధనము ధర్మంబు;
ధనమే రూపంబును; ధనమే కులంబు.
అదిగాన, ధనము లేదనుచు వచ్చినను
వదలక నన్నేల వాఁడు గైకొనును!
కాన, దీనికిఁ -[2]బ్రతీకారమ్ము నేను
బూనిసేయకయున్నఁ బొందునే యెలమి!
వీనిమాటలునమ్మి[3] యిష్టుండననుచు?
నేనేలవచ్చితి నీనీచుకడకు!
బొంకునకోర్చి యీభూపాధముండు
గొంగక యిట్లాడెఁ గ్రూరవాక్యముల.
పుడమీశులను నమ్మఁబోల దేభంగిఁ,
గడుపాపముల మూలకందంబులౌట;
బహురాజ్యమదమను పానంబు గ్రోలి
యహరహంబును మత్తులైయున్న కతన
నెదిరిని దమ్ము నిమ్మెఱుఁగరెన్నఁడును;
బొదలుజిహ్వకు నీచభోగ్యంబులైన
యన్నమదంబున నంధత్వమొంది.
కన్నులఁగానరు గానిచందముల;

  1. లేమిచే నెన్నడు లేమియిచ్చుటకు
  2. ప్రతికార్యమ్ము నెలమి
  3. విష్కండ ననుచు (మూ)