పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

272

ద్విపద భారతము


ఇమ్మహాపరిభవ మేభంగి నోర్తు!
నిమ్మహీపతీగర్వ మేభంగిఁ దీర్తు!
తనువునఁగాఁడిన దారుణాస్త్రముల
ననువున వెడలింప నానొప్పి యుడుగు;
మనముననాటిన మర్మవాక్యములు
విను మెన్నిభంగుల వేదనచెడవు,
గర్వాంధుఁడగువాని గర్వింపఁజాలు
నిర్వాహమునఁ బల్కు నెఱిదీర్పవలయు.
తా నెందుఁ జివ్వకుఁ దగదుచేఁజాప ;
మానక తనుదానె మాటవీడ్వడిన
నరులెవ్వరును దన్ను నమ్మకయుండ
భరమునఁ దఱివేచి భంజింపవలయు.
ఏరీతి వెడలింతు నీమనోవ్యాధి!
నేరీతి నీఁగుదు నీశత్రుఋణము!
అని వితర్కించుచు ననఘ, నామనము
ననుమానమొందుచు నలసి కుందుచును,
మదమెల్లనింకిన మదనాగమనగ,
నదటెల్ల నణఁగిన నర్తకుండనఁగ,
పటు[1]దండహతి రేగు పాపఱేఁడనఁగ,
జటలెల్లఁ బెఱికిన సింగమో యనఁగ
లేమికంటెను జావు లేదుపో! యనుచు,
నామహీశునిసభ నల్లన వెడలి
వచ్చితి”. ననిన భూవరుఁడు భీష్ముండు
ఇచ్చలో సంతోషమిగురొత్త ననియె:
"భావింప నేఁడు మాపాలిటి భాగ్య
దేవతవై యేఁగుదెంచితిచ్చటికి.
 

  1. తుండ (మూ)