పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

224

ద్విపదభారతము


పుత్త్రమోహము మాని, పొనర నీయగ్ర
పుత్త్రుని విడువుము భువియెల్లఁ బొగడ.
[1]నాకంటె నీ కిట్టు నలిఁ జెప్ప హితులు
భూకాంత, యెందును బుట్టుదు రింక!
అన్నవు; నీకు నే నర్థిదమ్ముఁడను;
మన్నించి యీమాట మది నియ్యకొనుము".
అనినఁ గోపాంధుఁడై యాయంధుఁడనియెఁ:
“దనయులఁ దునుమాడు తండ్రులు గలరె!
మునుమును బుట్టిన మోహంపుఁగొడుకుఁ
దునుమాడి బ్రదికెడి ద్రోహులుఁ గలరె!
ఇది యేమిమాటగా నిచ్చనో నాడి!
తది నీకుఁ బాడియే యకట! దుర్బుద్ధి!
వాక్రువ్వరాని యీవాగ్దోష మేను
నేక్రియఁ బాపుకో నెన్నుదు మదిని!
వినవచ్చుమాటలు వినవచ్చుఁగాక,
వినరానిమాటలు వినవచ్చు నెట్లు!
ఈతప్పు గాచితి నిఁకఁ దమ్ముఁ డనుచుఁ;
బాతకంబులఁ బల్కఁ బాడిగా దుడుగు".
అని విడనాడిన, నాబాలుచేతఁ
దనవ్రేఁగు దిగునని ధర సంతసిల్లె.
అంత నంతకుమున్నె యాపాండురాజు
గొంతి నుత్తమకాంతఁ గొనియాడి పలికె :
“వనిత, యీపుత్త్రుని వలనొప్పఁ జూచి,
యొనరంగ సంతోష ముబ్బచున్నదియు;
ఎలమి నెవ్వఁడు గల్గ నీజగత్త్రయము
...... ....... ........ ........ ........ ....... ........

  1. నాకంట నీకంట నలిచప్ప హితుండు (మూ)