పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; చతుర్థాశ్వాసము.

223


అన్నిప్రకారంబు లటు మహాప్రేమ
తన్నాత్మ నలరింప ధరణిపాలుండు,
నలి జాతసంస్కార నామసంస్కార
ములు మునిసహితుఁడై ముదమొప్పఁ జేసి,
దాదులచేతికిఁ దనయవర్గంబు
నాదట నిచ్చుచో, నవసరం బెఱిఁగి
పదరక భీష్ముండుఁ బౌరులు బుధులు
మొదలైనవార లిమ్ముల నేఁగుదేరఁ,
బ్రాకటంబుగఁ గురుపతితోడ నప్పు
డేకాంతమున వచ్చి, యేపుమై నిలిచి
వెఱవక విదురుండు విభున కి ట్లనియె:
"ఎఱిఁగింతు నొకమాట యిది వేళగాన,
నెట్టన ధృతరాష్ట్ర, నీపెద్దకొడుకు
పుట్టినదినమున భూకంపమయ్యెఁ;
బరికింప నూఱుకంబంబుల మేడ
ధరఁగూలెఁ బ్రతిమలతఱచుతోఁగూడఁ;
దోచె వెండియుఁ బెక్కుదుర్నిమిత్తములు;
పూఁచి చెప్పఁగరాదు భూపాల, నీకు;
అవిరళగతి విను మదికారణముగ
నవిరళజనసంక్షయంబౌను; దీనఁ
గులమెల్లఁ దెగటార్చు [1]కుమతిగాఁగలఁడు;
వలవదు చంపవె వాని నొక్కరుని!
ఉన్నారు సుతులు యుయుత్సుండు నీకుఁ ,
జెన్నార [2]వేయిలోఁ జిదురును బోదు.
కాన, సుయోధనుకారణంబునను
బూని యపాయముల్ పుట్టకయున్నె!

  1. కోటి (కోతియని వ్రాసెనేమో)
  2. వెల్మిలో విగురునకు చోఁడు