పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; చతుర్థాశ్వాసము.

211


అనుటయు, దీనుఁడై యప్పాండురాజు
తనపేరు చెప్పి యందఱకుఁ గేల్మొగిచి :
"యేనును వచ్చెద హితపుణ్యులార,
మానిను లలసిరి మముఁ గూర్చుకొనుఁడు.
నారు లెన్నఁడుఁ దొల్లి నడచినవారు
గారు; త్రోవల [1]చక్కిగరగరగాదు.
ఏమితీర్థంబుల కేఁగుచున్నారు?
హేమాద్రి కేఁగుచో నెఱిఁగింపుఁ”. డన్న
మౌనులు పలికిరి మనుజేశుఁ జూచి:
"కానఁబోయెద మేము కమలసంభవునిఁ;
బోయి, యమావాస్యపుణ్యకాలమున
నాయన సేవింతు రమరులు మునులు.
ఇంద్రాదిలోకంబు లిన్నియుఁ గడచి
చంద్రవంశాధీశ, చనవలె మాకు.
ఎంతవారలకైన నింతటినుండి
సంతతిలేనిచోఁ జనుదేరరాదు.
లోలత నొకబ్రహ్మలోకంబయేల !
యేలోకమున[2] లే దపేతపుత్త్రునకు.
సంతానలాభంబు జననాథతిలక,
చింతింపు; మది నీకు సిద్ధింపఁగలదు.
వరసుతుల యమ వాయు వాసవాశ్వినుల
వరమునఁ గాంచెదు వంశవర్ధనుల".
అని నిల్పి పోయిన, నాతండు మరలి
చనుదెంచి, ఖిన్నుఁడై సతిఁ గొంతిఁ బలికె :
"మానిని, చూచితే! మనల నేర్పఱచి
మౌనులు పోయిరి మఱి కూడనీక.

  1. సద్ద
  2. లేదు పేద (మూ)