పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

200

ద్విపద భారతము


యరుదెంచి, పాండున కతిభక్తి మ్రొక్కి,
కరము చక్కనితూపు కానుక యిచ్చి,
[1]నాదారుటెఱుకుల కాధారమైన
యాధారుణీపతి కప్పు డిట్లనిరి :
"ఏమున్నయడవిలో నిభపురాధీశ,
భూమికివ్రేఁగైన భూరిజంతువులు
మాయలవులరాక మాయలఁబెట్ట,
నాయుగ్రవిధముల కాత్మలోవెఱచి
వచ్చినారము; నీవు వాని వధింప
విచ్చేయుటకు వేఁటవిన్నాణమునకు.
అందలిమృగముల యదటుగర్వములు
పొందుగా నవధరింపుము ; ధాత్రిఁ గొంత
త్రవ్వి, పాతాళవరాహంబుఁ దెచ్చి,
క్రొవ్వునఁ దమకదుపుఁ గూర్తుమన్నట్టు
లఱ్ఱులావెసగ మహావరాహములు
మిఱ్ఱుపల్లము గాఁగ మేదిని గ్రుచ్చి,
యెత్తిన బిగువున నించుకతడవు
నెత్తి భారముమాన్పు నిజము శేషునఁకు;
బులిరక్కసునిఁ జంపి పులితోలు గట్టి
పులినోరికండ యెప్పుడు వ్రేల నిఱికి
హరుఁ డున్నవాఁడని యాతనిమీఁది
[2]గుఱి కమార్గములందుఁ గూడెనో యనఁగ
బబ్బరింపుచు గుంపుబలసి గుబ్బులుగ
బెబ్బులు లుబ్బులు బెరయ వర్తించుఁ ;
జెలఁగుచు గుహలలోఁ జీకటి[3]వెడలి,
తల కేలు కాలు చైతన్యంబు వచ్చి,

  1. యాధార మెరుకకు నాధారమైన
  2. గురు
  3. వెర్కి (మూ)