పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; చతుర్థాశ్వాసము.

199


నిలువున మ్రాఁకులై నిలువంగనేర్పుఁ
గలుగుకిరాతు లొక్కట నొక్కనాఁడు
కోకతాలికతలల్, కోర[1]చిందములు,
వాఁకైనయురితీఁగె, వట్టుబొంగులును,
నెఱయఁ జొత్తిల్లిననిడుదకన్నులును,
గఱకులై మిడిసిన కావిమీసములు,
నమలియీకెలు, నిల్వనాటినతలలుఁ,
జుమచుమనైన నెత్తురుచుక్కబొట్లుఁ,
[2]గంపులు పుట్టెడు కఱకందుమేను,
లంపచిప్పతోడ నలరుహస్తములు,
బీరనరంబులు, బిగువుపిక్కలును,
దోరవన్నియచెప్పుదోయినిఁ గలిగి,
వసుధకు డిగ్గిన వానకాళ్లనఁగఁ
గసరున నెసగుసాగర [3]వీచు లనఁగఁ
బొరిపొరి నేతెంచు భూతంబు లనఁగ
నరులచూడ్కికి వింత ననుప చేయుచును,
నినుపు పున్నమనాఁటి నెలలునుబోలె
ఘనపుండరీకభీకరకరు లగుచుఁ,
జౌలసంస్కారవిశాలురు పోలె
నాలోల కాకపక్షాంకితు లగుచుఁ,
బొనర మేడలమీఁది పురజనుల్ పోలె
ఘనజలమార్గవీక్షణపరు లగుచుఁ,
గనుఁగొన నుగ్రరాక్షసులును బోలె
ఘనరామలక్ష్మణాగ్రహయుక్తు లగుచుఁ,
దెమలనిమృగములఁ ద్రెవ్వనేయించు
తమకాన నందఱుఁ దమకాన నుండి

  1. పెందమాలు
  2. క్రంపలు బట్టిన
  3. వీథు లనఁగ (మూ)