పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; చతుర్థాశ్వాసము.

201


యరిరాజచంద్రుని యచలాగ్రమెక్కి,
గుఱుతుగాఁ గుధరంబు గోరాడ ననఁగ
వెల్లమోరలతోడ వెదుళులు ప్రాఁకి,
భల్లూకములమూఁక భయము పుట్టించుఁ;
గొండలు గోరాడి, కొమ్ముల నొడల
గండెక్కి యెఱ్ఱరేగడిమన్ను మెఱయ,
మొసళులమడుగుల మునిఁగి, యాఁబోతు
లెసగి యల్లనమోము లెత్తి యల్లార్చి,
ముక్కులు బిగియించి ముదురూర్పుపుచ్చుఁ ;
జుక్కలగతి మిన్ను సోఁకుదుప్పులును,
లాసికటారికోలలు పట్టి యాడు
మాసటీలునుబోలె మసలక డాసి,
కొమ్ములరవళి దిక్కులఁ గప్పుదుప్పు
లిమ్ములఁ బోరాడు నిలపెల్లగిల్ల;
భువినుండి యొకయిఱ్ఱి పుటముగా నెగసి,
ప్రవిమలచంద్రులోఁ బడఁ దాటెఁ దొల్లి;
యంతవారము నేము నగుదుమన్నట్లు
వింతగా నిఱ్ఱులు వినువీథి దాటుఁ ;
బెరిగినపెక్కువఁ బెక్కుమెకములు
నురవడి మెఱయును నొక్కొక్కచోట;
నన్ని తూపులఁగాని యణఁగమన్నట్లు
మున్నాడి యేదులు ములుచూపు మాకు;
మూరిబోఁ బెరుగు చమూరుమృగంబు
లూరినచీఁకటి [1]నొంటిఁబోనీవు ;
కడఁతులలెక్క యెక్కడఁ బట్ట[2]వచ్చుఁ !
గడలేవు హరి ఖడ్గ కరి శరభములు;

  1. నొండు
  2. నేర్చు (మూ)