పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆదిపర్వము ; తృతీయాశ్వాసము.

187


దిననాథనిభులకు ధృతరాష్ట్రపాండు
లనియెడునామంబు లనువుగావించి
పెనుచుచో, మఱి యంతఁ బెద్దకోడలికి
ననఘ, పుప్పోదయంబైన యట్లైన,
మజ్జనదినమున మాపటివేళ
సజ్జననుతుఁ బరాశరసూనుఁ దలఁచి
రప్పించి : " పలుక నేరరు మఱఁదండ్రు;
తప్పిరి నినుజూచి; తమ కేలవెఱవ !
ఇంగితంబెఱిఁగి నిన్నించుక సేపు
శృంగారరసపూర్ణుఁ జూడలేరైరి.
ఊనంబుగలిగిన నుర్వీశునైన
మానవు లొక్కింత మతులఁగై కొనరు.
అనిచెదఁబ్రార్థించి యంబిక నేఁడు ;
తనయునొక్కని దివ్యతనయుఁగా నీవె!"
అనిచెప్పి యారాత్రి యాయింతి ననుప,
మునిఁబొందనేరక ముద్దియరోసి
తత్తరింపుచు డాఁగి, తనదాదికూఁతు
నత్తగానకయుండ నంపె; నంపుటయు,
నదివోయి తననేర్పులన్నియు మెఱసి
మదనుండుమెచ్చంగ మౌనిఁగూడినను,
దల్లికి ఱేపాడి తనయుఁడిట్లనియె:
"నుల్లోకవిజ్ఞాని యుదయించుఁ గొడుకు ;
[1]శూద్ర గాంచుటఁజేసి శూద్రుఁడౌఁ; గాన,
భద్రాంగి, కులము నిల్పఁగఁజాలఁ డతఁడు. ”

  1. శూద్రి. (మూ)