పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

ద్విపద భారతము


బాలికయైన యంబాలిక నేఁడు
నోలినంటుననుండి యుదకంబులాడె;
దానిఁ బుత్తెంచెదఁ దనయునొక్కరునిఁ
బూని దోషవిహీనుఁబుట్టింపుమందు. "
అనుచుఁ దొల్లిటియట్ల యామినివేళ
మునియున్నచోటికి ముద్దియ ననుప,
నదిపోయి మునిపుత్త్రునాకృతిఁ జూచి
బెదరి వెల్వెలఁబాఱ, 'వెఱవకు ' మనుచుఁ
గాలోచితముదీర్చి, ఘనుఁడు మర్నాఁడు
చాలవేడుకనున్న జననికిట్లనియె:

ధృతరాష్ట్రపాండురాజుల జననము

“అంబ, యంబాలిక [1]యందులోపమునఁ
గంబువర్ణుఁడుసువ్వె గలుగు నందనుఁడు ;
వెలవెలఁబాఱినవికృతికి నదియుఁ
దలఁప నూరకపోదు తల్లిదోషంబు."
అనిచెప్పిమునిపోవ, నంతఁ గోడండ్రఁ
గినిసి గర్భములురక్షింప నేమించె,
అంత వ్యాసులుచెప్పినట్ల నందనులు
కాంతల కిరువురు గ్రమముతోఁ గలిగి ;
రాజానుబాహువు లమరమార్తాండ-
తేజులునై యుండ దృష్టించి, యప్పు
డుప్పొంగి గాంగేయుఁ డోలి బ్రాహ్మణుల
రప్పించి ధనముధారలువోసి యిచ్చి,
పురము శృంగారింపఁబుచ్చి, సక్రమము
కరమొప్ప జాతసంస్కారముల్ చేసి,

  1. యవనిలోపలను. (మూ)