పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

ద్విపద భారతము


యముఁడు విదురుఁడై జనించుట

అనిచెప్పి మునిపోవ, నంత ----------
తనకర్మమహిమ నద్దాదికూఁతునకు
విదురుఁడై పుట్టిన, వేడ్క భీష్ము
ప్రిదులక నానాఁట [1]బెంచ జాలనని.
ధర శూద్రయోని నంతకుఁడుపుట్టుటకు
నరనాథ, విను కారణంబుచెప్పెదను.
ఒక్క భూపాలునియూరిచేరువను
మక్కువ నడవిలో మాండవ్యమౌని
తపమున్న చోటున, ధరణీశునగరి
విపులార్థములు చోరవీరులు దిగిచి,
యరుగుచు రాత్రి యయ్యాశ్రమభూమి
తెరువున నరుగుచో, ధృతి నంతలోనఁ
దలవరు లాచొప్పు తడవి యే తెంచి
తులువలఁ గానక ధూర్తులై గదిసి :
'మునినాథ, కానవేమ్రుచ్చుల ! ' ననినఁ,
బనివడి యామౌని పలుక కుండినను:
'ఇతఁడును, దొంగలు నేకమై నేఁడు
పతిసొమ్ముదెచ్చిరి ; పలుకులే ! ' లనుచు
జడలుకంపలఁబట్టి, జపమాలఁద్రెంచి,
మెడనల్గుగట్టించి, మిన్నక తిగిచి,
యంతరంబెఱుగనియాతతాయులకుఁ
జింతింపఁ బాపంబు సిద్ధించు [2]ననక
సందెఁద్రాడొనరించి, జనపతి [3]కడకు
నందఱుఁగొనితెచ్చి యతనిసమ్మతిని
శూలాగ్రమునవైవ, స్రుక్కక మౌని
వాలిన తనతపోవైభవంబొప్పఁ

  1. బెంపనాతండు.
  2. గాన.
  3. తోడ. (మూ)