పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆదిపర్వము ; తృతీయాశ్వాసము.

185


జాదులు ధరియించి ననుదెంతుగాక;
భూ దేవుఁడున్నాఁడు పువ్వుఁబార్పునను ;
అతండు వేదవ్యాసుఁ డతివ, మీబావ ;
యతిభక్తియొనరించి యడుగుము సుతుని. "
అనుటయు లజ్జించి యత్తకుత్తరము
వనిత యీనోపక విరుసఁగై సేసి,
రత్నదీపంబులు రమణీయధూప
యత్నంబుఁ గలిగినయచటికిఁ బోయి,
కపిలవర్ణంబైన గడ్డంబు ---------
దపసినల్లనిమేనుఁ దప్పకచూచి,
యొడలు [1]నిబ్బరికింప నొ డాడ నోడి,
వెడఁదకన్నులుమోడ్చి వెఱచుచునుండఁ,
దగినకార్యముదీర్చి ద్వైపాయనుండు
మగువ మక్కువఁబంచి, మఱునాఁడు ఱేపు
అంబికవృత్తాంత మడుగుచున్నట్టి
యంబతోనిట్లను : " నయ్యెఁగార్యంబు ;
పుడమియేలెడుభోగి భుజబలోన్నతుఁడు
కొడుకు జన్మించు నీకోడలియందు ;
ననుజూడనోడి యున్నతిఁగన్ను మోడ్చు
జననిదోషంబున జాత్యంధుఁడగును ;
అంబికాసంభోగ మభవుండు సేయ
లంబోదరుఁడుపుట్టె లలి వక్రముఖుఁడు ;
ఈయంబికయుఁ బుత్త్రు నిటుగనఁగలదు ;
చేయ నేమున్నది శివునాజ్ఞగాక !
ఏనుబోయెద" నన్న నింతిచింతించి:
"మౌనీంద్ర, పోకుము; మఱిపోదుగాని,

  1. "జలదరింప" అనుటమేలు. ప్రస్తుత పదము ఈయర్థముననే ప్రయోగింపఁ బడియుండును.