పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

ద్విపద భారతము


పూఁబోఁడు లనుకూలబుద్ధి వారైన,
నేఁ బూని కావింతు నీప్రయోజనము.
క్షేత్రంబులోని విశేషంబువలన
క్షాత్త్రఁబుగలవాఁడు జనియించుఁ గొడుకు.
నెలకొని యొకయేఁడు నియమంబుసలిపి
నలినాక్షులున్నచో, న య న న్నీవు
తలఁపుము ; నేవచ్చి తల్లి, వారలకుఁ
గుణముసల్పఁగనోపు కొడుకుల నిత్తు."
ననినఁ గుమారుతో నతివయిట్లనియె:
“దినహానియేల ! ధాత్రికి రాజులేఁడు ;
నాకోడలున్న ది నాల్ నాళ్లుచేసి ;
యేకతంబున నీకు నేనుబుత్తెంతు
[1]ర. " మ్మని యంతఃపురమున కాతనిని
సమ్మతిఁగొనిపోయి, శయ్యపై నునిచి,
యంబికాంగనయున్న యావాసమునకు
సంబరంబున రాత్రి చనుదెంచి పలికె:
"ధర్మమార్గంబునఁ దరుణి, నీకొక్క
కర్మంబుచెప్పెదఁ గైకొనివినుము ;
నిరతసంతానంబు నిలుపుటకంటెఁ
బరమధర్మములేదు [2]పతి ధర్మవతికి.
రమణుఁగోల్పోయినరాచయిల్లాలు
విమలాత్ముఁడగు విప్రువీర్యంబు దాల్చి
సుతులఁగాంచుటమేలు; శ్రుతి పురాణముల
వితతమీయర్థంబు ; వింటిమెల్లెడల.
ఈరాత్రి యుదకంబు లింతి, నీవాడి,
సౌరభగంధంబు చల్లనిమడుఁగు

  1. రమ్మని యంత నంతఃపురమునకు.
  2. ప్రతిధర్మములకు. (మూ)