పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

ద్విపద భారతము


కలరు నమ్ముము రాజకాంత లీరీతిఁ
గులమునిల్పినవారు కుంభినిమీఁద.”
ననిన శంతనుదేవి యంగీకరించి,
తనకుమారుని వ్యాసుఁ దలపోసి పలికె:
"కన్నియవయసునఁ గంటి నేఁబుత్త్రు ;
నున్నాఁడు మునిచంద్రుఁ డుత్త మోత్తముఁడు ;
[1]ఆరయఁబో నేల యన్యునొక్కరుని !
మేరువుపై నుండి మిన్నేల వెదుక !
శాంతిశీలుఁడు చాలఁజక్కనివాఁడు
కాంతిమతులఁజేరి కలిగించుసుతుల ;
ఆతఁడువ్యాసుండు ; మహామునిపుత్త్రుఁ ;
డితరుండుగాఁడు; నీవెఱఁగినవిధము.
అలయక నాయాజ్ఞ యమ్మహామౌని
తలఁదాల్చి పుత్త్రులదానంబొనర్చు.”
ననిన భీష్ముఁడులేచి యంజలిచేసి
కనుదోయిమోడ్చి చక్కఁగఁదూర్పునిలిచి :
"ఓంకారమయరూప, యోవ్యాసమౌని,
పంకజాసనునకుఁ బ్రతియైన స్వామి,
హరియుద్ధరించినయఖిల వేదములు
సరవి నేర్పఱచిన జగదేక హితుఁడ,
సావధానంబున సాత్యవ తేయ,
రావయ్య మీతల్లి రప్పింపుమనియె;
మునిచంద్ర, మునిసింహ, మునిసార్వభౌమ,
యనిమిషేశ్వరవంద్య, యరుగు దేవయ్య !"

వ్యాసుఁడు తల్లికిఁబొడసూపుట

అనిన, జేగురుకాల్వ లందును నిందు
[2]నినిచివ్రేలఁగవచ్చు నీలాద్రివోలె

  1. అరసిపోవఁగ నేల.
  2. నిలి. (మూ)