పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆదిపర్వము ; తృతీయాశ్వాసము.

181


సకలపావనమైన చంద్రవంశమున
[1]నొకఁడవె శేషించియున్నాఁడ టపుడు;
శంతనుహితముగా సంతానమునకుఁ :
గాంతానుభోగంబు గైకొనవలయు;
అరులు నీతరువాత 'హస్తినాపురము
దొరకుమా' కని యాసతో నున్న వారు ;
ఆరయబ్రహ్మచర్యం బింక వలదు ;
కారణంబెడలుచోఁ గార్య మేమిటికి ! "
అనిన భీష్ముఁడుపల్కు. : "నమ్మ, యిట్లేల
ననువిచారింపవు నయహీనుఁజేసి !
పట్ట నేరుతునఁట! పట్టినవ్రతమ
నెట్టన విడుతునే నింగి పైఁబడిన !
ఎల్లధర్మంబుల నెఱుఁగుదువంటి;
తల్లి, యీమాటకుఁ దగుదునె యేను !
ఎఱిఁగినధర్మంబు నే విన్నవింతు ;
నెఱిఁ జంద్రవంశంబు నిలుచునట్లైన.
పరశురామునిచేతఁ బతులఁ గోల్పోయి
తరుణులు తొల్లి త్రేతాయుగాంతమున
నాచరించినధర్మ మఖిలపురాణ
సూచితంబైనది సుచరిత్ర, కలదు,
సర్వలక్షణముల సంపూర్ణుడైన
యుర్వీసు రేంద్రుని నొకని వరించి,
సన్నుతి శుచి ఋతుస్నానంబు చేసి-
యున్న నీకోడండ్రయొద్దకుఁ దెచ్చి,
పుడమికిదిక్కుగాఁ బుత్త్రభిక్షంబు
నడిగించు ; గలిగెద రతనివీర్యమున.

  1. ఒకటియు. (మూ)