పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆదిపర్వము ; తృతీయాశ్వాసము.

183


మెఱుఁగుఁదీఁగెలతోడి మేఘంబుపోలె
చేఱపులై పింగళజట లుల్లసిల్ల,
ద్వైపాయనుఁడువచ్చి తల్లికిమ్రొక్కి :
'యేపనిగలిగెనోయెఱిఁగింపు; ' మనిన,
నప్పుడు గాంగేయుఁ డర్ఘ్యాదివిధుల
నప్పరాశరసూను నర్థిఁ బూజించి,
యున్న తాసనముపై నునిచి కీర్తించి,
కన్నులుచల్లఁగాఁ గనుఁగొనుచుండ
నా సత్యవతి వేడ్క నతనికిట్లనియె:
"వ్యాస, తలంపఁగా వచ్చితి నేఁడు ;
హరివోలె నందఱయంతరంగముల
చరితంబులెఱుఁగుదు సంయమితిలక !
ధర వచ్చివచ్చి శంతను [1]ననంతరము:
[2]పఱిపోవఁగానుండె భరతవంశంబు;
తనయులఁబడయఁ డితఁడు బ్రహ్మచారి ;
పనివడి గురునికై పట్టెనువ్రతము ;
కూలిరిద్దఱుపుత్త్రకులు ధురంధరులు;
వాలిన నాలోని వగలార్పవయ్య!
అంబుజముఖులు నీయనుజునిభార్య
లంబికాం బాలికలనియెడువార
లున్నారు; వారిలో నొకయింతియందు
మన్నించి యొక్క కుమారు నీవయ్య!
దేవరన్యాయంబు ధృతిఁజేయవచ్చు ;
నావల నీకంటె నర్హుండులేఁడు. "
అనిన, వేదవ్యాసుఁ డంబకిట్లనియె:
"విను మెఱుంగుదు లోకవిదితమీ తెఱఁగు;

  1. నందనుండు.
  2. పరసిపోవుచునుండె. (మూ)