పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆది పర్వము ; తృతీయాశ్వాసము.

171


అనుటయు, వేడ్కఁ జా నాగంగననిచి
తనయునిఁదెచ్చి, శంతనమహీవిభుఁడు
హస్తిపురంబులో నతనికి వేడ్కఁ
బ్రస్తుత యువరాజపట్టంబుఁ గట్టి,
రణమున సాధింపరానిశాత్రవుల
నణుమాత్రమున గెల్చి, యతనిసత్వమున
జలరాశి వేష్టిత సకలభూతలము
నలమి యేలుచునుండి, యటనొక్కనాఁడు,

శంతనుఁడు సత్యవతిని మోహించుట

ఆప గేయునిమీఁద నఖిల భూభరము
మోపి, రథంబెక్కి- ముదము రెట్టింప
యమున [1]వాలునకు నెయ్యమున వేటాడ
నమితసేనాఢ్యుఁడై యరిగి, యచ్చోటఁ
గప్పారుజలముపైఁ గాంచనచ్ఛాయ
నొప్పారుచున్న యాయోజనగంధి
నీలమేఘంబుపై నెలకొను మెఱుపుఁ
బోలియుండఁగఁ జూచి, బుద్ధినూహించి :
"యీసౌరభంబును, నీజవ్వనంబు,
నీస్వరూపము బ్రహ్మ యీయింతికొసగి
[2]నౌకల వలనొప్ప నడుప నిట్లునిచె;
నీకార్యమునఁగదా యితఁడు [3]ఛాందసుఁడు ! "
అనితలపోసి యిట్లను నింతిఁజేరి :
"వనిత, నీరూప యౌవన విలాసములు
సూడిదగాఁ జిత్తజునకు నీవచ్చు:
నోడరేవున నుండ నుచితమె నీకు !
నింతికి నర్ధాంగమిచ్చిన శివుఁడు
కాంత, నీరూపంబుగని సిగ్గువడఁడె !

  1. చాల్పునకు.
  2. నౌకలోపల నొక్క నౌప యిట్లునిచె.
  3. చెందసుఁడు. (మూ)