పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

ద్విపద భారతము


యక్కడఁ బొడగాంచె నాత్మనందనుని ;
నొక్కండు వింట నేయుచునున్న వాని,
నట్టగా నేసిన యుమ్ములకట్టఁ
దొట్టిన నీటికందుప నున్న వాని,
నరుదారఁ దనరూప మచ్చొత్తినట్లు
భరియించి బహుకళాప్రభనున్న వానిఁ
గనుఁగొని, తనసుతుఁగా నిశ్చయంబు
మనమునలేకయు, మమతావిభూతి :
"నెవ్వనితనయుఁడో యీదీర్ఘ [1]బాహుఁ!
డెవ్వనివుణ్యమో యీ మేలుగాంచె!
సుతు నింతవాని నీశుఁడు నాకు నీయ
క్షితికెల్ల యువరాజుఁజేయంగఁ దగదె!”
అనివిచారించుచో, నతనికి గంగ
వనితయైపొడసూపి వరలజ్జఁబలికె:
"ఏను మున్నిటిగంగ ; నితఁడునీనుతుఁడు;
మానవేశ్వర, నీవుమఱచిన వినుము.
ఇతఁడు వశిష్ఠుతో నెల్ల వేదములు
చతురతఁ జదివె శాస్త్రములతోఁగూడఁ ;
బరశురాముఁడు నేర్ప బహుతరవిద్య
శరములు మంత్రించి సంధింపనేర్చె :
వాహనారోహణ వరశక్తియుక్తి,
[2]వ్యూహాశుకృతులఁ దా నుపదిష్టుఁడయ్యె ;
సనకసనందన సన్మునీశ్వరుల
ఘనకృప నెఱిఁగె [3]యోగప్రకారంబు ;
నింతటఁ గొనిపోయి యేలింపుధరణి;
సంతాన [4]వంతులసరస నుండెదవు".

  1. దేహు-డె.
  2. వ్యూహతాసుకృతానుపవిష్టుఁడయ్యె.
  3. యోగపుకార్యంబు.
  4. రీతుల. (మూ)