పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

ద్విపద భారతము


కాముండు మూర్తితోఁ గలిగిననాఁడు
నీ [1]మేనుగలిగిన నిలుచునే [2]జగము:!
ఎన్నంగ ధరయెల్ల నేలినవాఁడ,
నన్ను నేలుదుగాక నలినాయతాక్షి !
కాముబారికి మునుగాము ; నీప్రేమ
యేమనిభావింతు నెఱిఁగింపఁగదవె ! ”
అనిన నాతనిమూర్తి కతివమెచ్చియును,
మనసువికారంబు మఱువెట్టి పలికె:
"ఏనియ్యకొననేర నీయర్థమునకు ;
మాన వేశ్వర, నీవు మాతండ్రినడుగు ;
అల్లదె మాపల్లె; యందు మాతల్లి
సల్లీలతోఁగూడి జనకుఁడుండెడిని ;
వారినుండియు నీవు వచ్చునందాఁక
వారినుండెదఁ బూర్వవర్తనంబునను ;
విచ్చేయు." మనవుడు, విరిదమ్మినుండి
యచ్చుగాఁ బోలేని యలిపోలె నతఁడు
సతిఁబాయలేకయు ఝషవైరివురికిఁ
గతిపయ [3]మంత్రిసంకలితుఁడై పోయి,
దాసుఁడయ్యును విష్ణుదాసుఁడైయున్న
యాసతీమణితండ్రి నచ్చోటఁ గాంచి,
యతనిచేఁ బూజితుండై వేడ్కఁబలికెఁ:
"జతురత మాతోడి సంబంధివైతి ;
కాశి నీగతి మత్తకాశినీమణుల
దాసులు గానరు తపముచేసియును.
రత్నంబుగంటివి ; రభసంబు [4]మిగుల
యత్నంబుతో నడుగ నరుదెంచినాఁడ.

  1. మేలు.
  2. జయము.
  3. మాత్ర.
  4. అఖిల. (మూ)