పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

154

ద్విపద భారతము


అనిన, దుష్యంతుండు నంగీకరించి
వనితకోరినలాగు వారకసలిపి,
మదనుండుమెచ్చంగ మగువతోగూడి
వదలనికూర్మి జవ్వనికి నిట్లనియె:
“పోయెద నోకాంత, పురమున కేను ;
నాయెడ నెయ్యంబు నాతి, మరువకుము.
పిలువఁబుత్తెంచెద బింబోష్ఠి, నిన్ను
నలరఁ దండ్రికిఁ జెప్పి యరుదెమ్ము నీవు."
అనుచు వీడ్కొనివచ్చి, యటసేనఁ గూడి
తనపురంబున కేఁగె ధారుణీ విభుఁడు.

భ ర తో త్ప త్తి


అట గణ్వమునియు, నయ్యడవిలోనుండి
పటురీతి సమిధలు ఫలములుఁ గొనుచుఁ
బర్ణశాలకువచ్చి, పరమహర్షమునం
బూర్ణచంద్రాననం బుత్రికఁజూచి,
సిగ్గును, వెఱవును, జిడిముడిపాటు,
నగ్గలియుఁ, గాంతి, యలస భావంబు,
గర్భచిహ్నము, మఱి గర్భస్థుఁడైన
యర్శకువిభవంబు [1] నంతయునపుడు
తనదివ్యదృష్టిచేఁ దప్పకదెలిసి,
మనముననలరి సమ్మతి నూరకుండె.
అంత, శకుంతల హర్షంపుదిథిని
గాంతిమంతుని బుత్త్రుఁ గనిన, నమ్మౌని
తడయక యేతెంచి, దౌహిత్రునకును
గడువేడ్కఁచేసి సంస్కారంబు లెల్ల :
[2]"సత్వాల బలిమిమై సమయించుఁగాన,
సత్వదమనుండగు శైశవంబునను;

  1. నాతండెరింగి.
  2. సత్వాదబలిమియు సమయంబుగాన. (మూ )