పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; తృతీయాశ్వాసము.

153


మెఱయ నాకసముపై మెఱుఁగారుమెఱుఁగు
నెఱయంగఁ దోచునే నేలపై నందు!
నింక నొక్కటి నాకు ఇందీవరాక్షి
కొంకక సమకూర్ప గూడును నీకుఁ ;
గ్రుంకుగుబ్బలి పొడ్పుగుబ్బలి కడల
నంకితంబైనట్టి యవనిమండలికి
నాయకుండననొప్పునాకు నోతన్వి,
నాయికవగుము [1] మన్మథశాస్త్రవిధిని."
అనిన, శకుంతల యవనీశుఁబలికె :
మునిలేనిపిమ్మట ముదితాత్మ, నాకు
స్వాతంత్య్రమున నీకు సమకూరనగునె!
మాతండ్రిరానిమ్ము మఱి యగుఁగాక '.
అనవుడు రాజన్యుఁ డబలకిట్లనియె:
"వినుము, నీ కేటికి వెఱవంగ ముగ్ధ!
యెనయ వివాహంబు లెనిమిదియందు
మIనత క్షత్రియులకు గాంధర్వసరణి
యెఱుఁగ వధూవరులిద్దఱుఁదక్క
మఱి యన్యులెఱిఁగిన మతముగా; దదియు,
వసుధ గాంధర్వవివాహంబు మున్ను
వసుధేశకన్యకావరుల కబ్బినది ;
మీతండ్రివిన్నను మిగుల [2]మోదించు;
నేతెంతుగా." కvdన నింతి యిట్లనియె:
“ నా కుమారుని రాజ్యనాథునిఁ చేయ
నీకుఁగూడిన, నేను నీచెప్పినట్లు
చేసెదఁ; గాకున్న, జేయంగఁగూడ;
దీసమయము నాకు నీడేర్పఁగలవె!"

  1. నన్నతశాస్త్రవిధికి,
  2. బోధించు (మూ)