పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

ద్విపద భారతము


బహువిలాసంబులు బహుగీతతతులు
బహునాట్యకళలును బహుభంగిఁజూపఁ,
దలయెత్తి యటు చూచి, తప మెల్లమాని,
వలరాజునకుఁదక్కి, వలవంతఁజిక్కి,
మేనెల్లమఱచి, యమ్మేనకఁగూడి
మానైన మరుకేళి మదమొప్పఁజేయ
వనితపుట్టిన, దాని వసుధపై విడిచి
వనిత మేనక యేఁగె వాసవుపురికి.
కౌశికుండును, నంత ఘనతపంబునకుఁ
గౌశలంబుననేఁగె గర్వంబుదక్కి.
ఇట యేడ్చుచుండంగ నింత నా బాలఁ
జటులశకుంతాలి సంరక్ష సేయ,
నొకనాడు కుశనది కొగిఁగణ్వమౌని
యకలంకగతి నట కరుదెంచిచూచి,
కొనిపోయి యబ్బాలఁ గూఁతుగాఁ బెనిచి,
తన [1]చెలియలిచేత స్తన్యమిప్పించి,
రమణ శకుంతాలి రక్షించెఁగాన
నమర శకుంతలయనుపేరు పెట్టి,
పోషకుండును దండ్రి భువినగుననెడి
భాష గణ్వుఁడు నాకుఁ బస దండ్రియయ్యె.
నని నాదువృత్తాంత మాద్యులు చెప్ప
వినియుందు నీరీతి విశ్వంభరేంద్ర!”
అనిన, నాదుష్యంతుఁ డధికహర్షమున
మనసిజుండేఁప నమ్మగువకట్లనియె:
“వనిత, నిజంబెకావలయు నెంతయును;
మనుజ కాంతల కిట్టిమంజిమ గలదె!

  1. చెలిచేతను (మూ)