పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

150

ద్విపద భారతము


ఆతిథ్య మొనరించి, యాసీనుఁజేసి,
చేతులుమొగిచి యాక్షితినాధుకనియె:
ఓరాజ, నీవెందునుండివచ్చితివి ?
నీరాక యిందేల? నీకుఁ బేరేమి?"
అనినఁ,దొయ్యలిఁజూచి యవనీశుఁడనియె ;
“ విను, నేను దుష్యంతవిభుఁడసువాఁడ ;
వేటకై సేనతో వెడలి యేతెంచి,
గాటంపుభక్తితో గణ్వసంయమిని
సేవింపవచ్చితిఁ జెలువ, 'నేనిచటి;
కా విప్రవరుఁడున్నయచ్చోటు చెపుమ. "
అసుడు, శకుంతల యతనికిట్లనియె:
" మునినాథుఁ డింతటిమున్నుగాఁ గదలి
సమిధలు దర్భలు శాకముల్ పండ్లు
నమరంగఁ గొనితేర నడవికిఁజనియె;
మీరువచ్చుటవిన్న, మీఱిన వేడ్క,
వారక యేతెంచు వనములోవెడలి."
అనుటయు, రాజన్యుఁ డాయింతిఁజూచి
మనమున నిట్లను:మహనీయకన్య
మునిపుత్రి యెట్లయ్యె ! మోగి దీనిమీఁదఁ
గనుకూర్మి నాకెట్లు కడముట్టఁబుట్టెఁ !
గానివస్తువుమీఁదఁ గాంక్ష, డెందమున
నూనదెన్నఁడు మఱి యుచితంబు దక్కి!
దీనిజన్మవిధంబు తెలియక నాకు
నూనిన సందేహ ముడుగదెంతయును."
అని యిట్లుదలపోసి యబలకిట్లనియె:
“ వనజాక్షి , యడుగంగవలసె నిన్నొకటి;
[1]బ్రహ్మవిదుండన బ్రహ్మణ్యుఁడనఁగ
బ్రహ్మచారియనంగ బరఁగుఁ గణ్వుండు ;

  1. బ్రహ్మవిండనంగనగణ్యుండనంగ. (మూ )