పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; తృతీయాశ్వాసము.

149


పలుమాఱుచూచుచు , భావంబులోన
వలరాజుతూపులు వాటమైనాటఁ,
బదరి తద్గుణపాశబద్ధుఁడై, కదల
మెదలంగనేరక మిన్నకయుండె.
మనసు మానినిమీఁద మరగియుండంగ
నెనయంగఁ దన్ను దానెఱుఁగంగలేక,
తరుణిలావణ్యామృతంబుఁ గ్రోలంగ
సరి ననిమేషత సంధిల్లెననఁగఁ
గనురెప్పవెట్టక కడువిస్మయమున
దనమనంబున నిట్లు దలపోయఁదొడఁగెఁ :
“జెలువల నాబ్రహ్మ సృజియించుచోట
నలర ఘృణాక్షరన్యాయాన దీని
సృజియింపఁబోలు నీక్షితి; నట్లుగాక
యజునకు నీనేర్పు నందమౌనేని,
యింక నొక్కతెఁ గాంత నీయింతి[1]సవతుఁ
గొంగక మఱి యేల [2]గూర్పంగ లేఁడు!
శృంగారరసమెల్లఁ జెన్నారఁ గూర్చి
యంగజుఁ డిచ్చోట యంత్రించెఁగాక!
వితతవేదాభ్యాస వికలుఁడైనట్టి
చతురాననున కట్టిచతురత గలదె!
ఈయింతికౌగిలి యెవ్వానికబ్బె,
నాయుత్తమునకబ్బు నమరరాజ్యంబు,
పటురీతి సరిచేయ భావ్యంబుగాదు
కుటిలకుంతలుల నీకోమలాంగికిని.”
అని యిట్ లుతలపోయు నవనినాయకునిఁ
గనుఁగొని, మునిపుత్రి గారవంబునను

  1. సతికి
  2. గూర్పగల్గెడిని (మూ )