పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము; ద్వితీయాశ్వాసము

127


మిండతుమ్మెదపిండు మించుఁబూఁదేనె
కండక్రొవ్వునఁ గ్రోలి [1]కలగుండుపెట్టె;
"మానినీమణులార, మానంబుమాని
మానుగాఁ గలియుఁడు మగల ' నన్నట్లు,
మావిలేఁజివురెల్ల మత్తిల్ల [2]మెసవి
కోవిలకదుపులు గొణఁగంగఁదొడఁగె;
ఫలరసధారలు బాగుగాఁ గ్రోలి,
చిలుకమూఁకలు గూడి చెరలుగొట్టుచును,
పంచబాణుని తేరి [3]వార్వాలమనుచు
ముంచి పాంథులమీఁద మొగమెఱ్ఱచేసె ;
విరహులవిరహాగ్ని విదితంబుసేయ
మరుఁడుపుత్తెంచిన మందిది యనఁగ
మలయాద్రిచలిగాలి మధుర సౌరభము
వలనొప్పఁ బొలసె నవ్వనవీధులందు.
అప్పుడు భార్గవి యతిసంభ్రమమున
నుప్పొంగి, చెలులతో నుద్యానవీథి
విహరించి, యెంతయు వేడ్కలింపార
బహుపుష్పవితతులు బహుభంగిఁగోసిఁ
పోగులుపోయించి, పుష్పాస్త్రునచట
బాగుగానొదవించి భక్తివ్రాయించి,
పూజించి యవ్వేల్పుబోఁటికిమ్రొక్కి
యోజతోఁ గొనియాడె: "నోరతిరాజ,
చిగురుఁగైదువుచేతఁ జిత్రంబుగాఁగ
జగములన్నియు గెల్చు జగదేకవీర!”
.......... .......... .......... .......... .........
.......... .......... .......... .......... ........

  1. కడుగుందుపెట్టి.
  2. చెమసి.
  3. బాణాల. (మూ)