పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

ద్విపద భారతము.


ఇల్లు [1]వట్టుము ; నీకు నిచ్చోటనుండఁ
దల్లి, ధర్మముగాదు ; తరుణివినీవు. ”
అని యొడంబఱుచుచో, నంతట దైత్య-
ఘనుఁడైన వృషపర్వ [2]క్రవ్యాదవిభుఁడు
తనతనయ చేసిన దంటతనంబు
మనముననెఱిఁగి, యమ్మగువఁ దోడ్కొనుచు
వచ్చి యాగురునభివందించి పలికె:
'హెచ్చి మాశర్మిష్ఠ యీయింతి కెగ్గు
లొనరించె; దీనినేలుఁడుదాసిగాఁగ;'
ననిన, నాశుక్రుండు నంగీకరించె.
అప్పుడు వేడ్కతో నాదేవయాని
యుప్పొంగి, శర్మిష్ఠ యొగిఁదన్నుగొలువ,
జనకుండు వృషపర్వసహితుఁడై యగ్ర
మునఁబోవ, నే తెంచెఁబురవరంబునకు.

దేవయాని వసంతవన విహారము

అంత, నాభార్గవి యట యొక్కనాఁడు
కాంతశర్మిష్ఠాదికాంతలు గొలువ
వనకేళిచేయుచో, వలనొప్ప నపుడు
వనమున నొప్ప [3]య్యె వాసంతలక్ష్మి,
మాకంద మందార మధుక మాలూర
శాఖోట పాటలి చంప కాశోక
సల్లకీ బిల్వాది సకలభూజములు
మొల్లంబుగాఁ బూచె ముదమొంద నలులు.
విరహులపై దండువెడలంగ మదనుఁ
డిరవుతో మునుబంచె నెలగోలనంగ,

  1. వట్టుట.
  2. గంహరి.
  3. యవ్వనవసంతంబు. (మూ)