పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

ద్విపద భారతము.


యయాతి దేవయానిని వివాహమగుట

అనుచుఁబ్రార్థనచేసి యంజలిచేసి
మనముననలరి నెమ్మదిగుండె, నంత,
నటయయాతియు వేటలాడంగఁబూని,
బటురీతిఁ జతురంగబలములతోడ
వేఁటకుక్కలు వలల్ వెస[1] బోయవాండ్రు
వాటంపుడేగలు వలనైన తెరలు
మొదలైనసాధనంబులు చాల గలిగి,
పదిలుఁడై యడవికిఁ బసతోడవచ్చి,
తెరలును చలలును దివిఱిపన్నించి,
చుఱుకుగా మృగముల జోరువెట్టించి,
వటహ భేరీ శంఖ పణవ నిస్సాణ
పటువాద్యములు చెవుల్‌పగులమ్రోయించి,
బెదరినమృగరాశి ప్రిదులక డాసి,
వదలక కుక్కలఁ బాఱంగవిడిచి,
బాణజాలములేసి పార్థివోత్తముఁడు
త్రాణతో శరభాలి ధరమీఁదఁగూల్చి,
సింగాలవధియించి, చెండిబెబ్బులుల,
భంగించియలుగులఁ, బందులఁగ్రుచ్చి,
మన్నుబోతులఁద్రెంచి, మహిషాళిఁద్రుంచి,
చిన్ని [2]కొర్నవగండ్లఁజెలఁగిఖండించి,
కడతులఁగారించి, ఖడ్గజంతువుల
మడియించి, చిఱుతలమదమెల్లఁద్రెంచి,
దుప్పులఁదెగటార్చి, తూఁటాడి కరుల,
నొప్పించి యెద్దుల, నుడుగక మఱియుఁ,

  1. బోవు.
  2. కొరున్‌వలేళ్ల. (మూ)