పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము; ద్వితీయాశ్వాసము

121


అంత మాపటివేళ నావులవెంట
నెంతయుఁ గచుఁగాన కిట దేవయాని
జనకునకిట్లను: “జనక, యిదేమి !
ఘనుఁడు నీశిష్యుఁ డెక్కడఁబోయినాఁడు ?
అసురులు నేఁడును నడవిలోఁ బట్టి
[1]మిసిమింతుఁజేసిరో మిన్నక వాని ” !
అనవుడు భార్గవుఁ డాత్మజకనియెఁ :
“దనయ, యావ----పై దానవులెల్లఁ
జలముగొన్నారు; నేఁ జాల రక్షింప ;
నలయక కచుడింక నరుగనీ దివికి,
తాడెక్కుమానిసిఁ దగఁ గ్రిందుపట్టి
యెడగాను ద్రోయంగ నెవ్వరివశము ! "
అనినఁ, దొయ్యలిపల్కు : 'నతఁడులేకున్నఁ,
గొన నన్న పానముల్ కుందుచు. ' ననుడుఁ,
దనయపై ననురాగదయుఁ డౌటఁజేసి
విని, భార్గవుండు వివేకించిచూచి,
యన్నిలోకంబుల నతఁడు లేకున్నఁ
గ్రన్ననఁగని, తనకడుపులోఁ జూడఁ
బోవంగ నందులో [2]బుగ్గియైయుండె ;
గావున, సంజీవిఘనమంత్రశక్తి
బ్రదికించి, వానికిఁ బ్రాణమంత్రంబు
లొదవినదయతోడ నుపదేశమిచ్చి:
'యిందాఁక నాజ్ఞాన మెడలించెమధువు ;
నిందితంబగుఁగాక నెఱి నింతనుండి;
[3]పరఁగ మధుపానంబు పాతకం.' బనుచు
గురుసమయముచేసి గురుపుత్త్రుఁబలికె ?

  1. మిసిమిగా.
  2. బుద్ధి.
  3. పరగని మధుపానపాతకుండనుచు. (మూ)