పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

ద్విపద భారతము.


'పగవారిబాఁపనిపట్టివీఁ ' డనుచుఁ
దెగిచంపి ; రంతలొ దినపతిగ్రుంకె ,
హోమధేనువులెల్ల నొగిఁ దోవఁబట్టి
తామె యింటికిరాఁగఁ, దనసఖుఁ గచుని
గానక భార్గవి కలఁగిశోకింప,
దానవాచార్యుండు తనయ కిట్లనియె:
"శోకింపనేటికి సుదతి, నీకిప్పు
డేకోర్కియైన నే నిచ్చెదనడుగు ;"
మనిన, నాతండ్రితో నతివయిట్లనియె :
"అనఘాత్మ, నేఁ డేమి యావులవెంటఁ
గచుఁడురాఁడాయెను ! గానలోపలను
[1]బ్రచురంపు, మృగకోటి పాలాయెనొక్కొ !
ఏవిధంబుననైన నెఱిఁగి, నీమహిమఁ
దేవయ్య వాని నాదృష్టిభూమికిని."
అనుడు శుక్రుఁడు తనయాత్మఁ జింతించి,
దనుజులచేనొచ్చి ధరనుండుటెఱిఁగి,
సంజీవనీవిద్య చయ్యనఁబుచ్చి
సంజీవితునిఁజేసి, సామర్థ్యమొప్ప
రప్పింపఁ, గచుఁజూచి రాను భార్గవియు
నుప్పొంగె హర్షాశ్రులొలుకంగ నపుడు.
వెండియు నొకనాఁడు వికటాటవులను
దండినావులఁగావ, దనుజులు కినిసి
కచునిఁ జూర్ణముచేసి కలితమద్యమున
నుచితంబుగాఁగూర్చి యుశనునకొసగ,
దానవాచార్యుం డుదగ్రుఁడై త్రావి
తానుదన్నెఱుఁగక దర్పించియుండె.

  1. ప్రచితంపు. (మూ)