పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

ద్విపద భారతము.


"ఓవత్స, నీవు నాయుదరంబు చించి
వేవచ్చి యీమంత్రవిభవంబుచేత
ననుబ్రదికింపుము నయవిధి. " ననిన
ననయంబు నా తండు నట్లకాఁజేసి,
దండప్రణామంబు తగ నాచరించి
కొండంతభక్తితో గురునకిట్లనియె:
“అనఘాత్మ, నీచేత నఖిలవిద్యలును
దనరంగ నేర్చితి ధర్మమార్గమున ;
భారతీదానంబుఁ బ్రాణదానంబు
నేరుపఁగల నింక నెఱయ నన్యులకుఁ ;
బోయెదనే;" నన్నఁ బొంగి భార్గవుఁడు
ధీయుక్తి నాకచు దీవించియనిపె.

కచదేవయానుల పరస్పర శాపప్రదానము

అనిపిన నాదేవయానికిఁ జెప్పి,
చనియెదనని పోయి జవ్వనిఁబలికె:
"గురుఁడురమ్మని నాకుఁ గోరిపుత్తెంచె;
గురునిచే నంపించుకొని వచ్చినాఁడ;
నెఱి నింకఁ బోయెద నిజగేహమునకు;
నెఱిఁగింపవచ్చితి నింతి, నీ. " కనిన,
ననఘు నాకచుఁజూచి యా దేవయాని :
"వినుమయా కచ, నీవు విభుఁడవై నాకు
నుండుదుగా; కింక నొండుఠావునకు
దండికూరిమిమాని తగునె నీ కేఁగ!”
అనవుడుఁ, గచుడు నెయ్యముమాని పలికె:
“ననునిట్లు నీవాడ నాయమె ముగ్ధ !
గురుపుత్రి వరియించు కునుతులుగలరె !
తరుణి, ధర్మములెల్లఁ దప్పనాడెదవు !