పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము; ద్వితీయాశ్వాసము

119


శుక్రుచే సంజీవి <>సుపద.</>శుభదమంత్రంబు
సక్రమంబునఁగాంచి జరగిరావయ్య !
అట్టైన, మాకు నీయమరరాజ్యంబు
నెట్టనసిద్ధించు నీప్రసాదమున. "
ననుచు దేవతలెల్ల నర్థిఁ బ్రార్థింప,
ననయంబుఁ గచుఁడును 'నవుఁగాక ' యనుచుఁ
జనుదెంచి, యాశుక్రసంయమీంద్రునకు
వినతి దండము వెట్టి వేడ్కనిట్లనియె:

కచుఁడు సంజీవనీవిద్యకై శుక్రునొద్ద కేఁగుట

"ననఘాత్మ, యేను బృహస్పతిసుతుఁడ ;
నొనరంగఁ గచుఁడ; మీయొద్దనె విద్య
లన్నియుఁ జదువంగ నరుదెంచినాఁడ ;
నన్ను శిష్యునిగాఁగ నడుపవే ! ” యనినఁ,
గావ్యుండు ‘నట్లనె గావింతు' ననుచు
భావ్యంబు మదిలోనఁ బరికించి చూచి :
‘రూఢి వీఁ [1]డమరపురోహితుకొడుకు
ఈడఁజదువుట నాకు నెన్నిక ;' యనుచు,
నాకచునకు వేడ్క సఖలశాస్త్రములు
జోకగాఁ జెప్పుచు శుక్రుఁడున్నంతఁ,
గచుఁడును గురుసేవ కడఁకఁ జేయుచును
నచట శుక్రునికూఁతురగు దేవయాని
నిచ్చలుఁ దనతోడ నెయ్యంబు సేయఁ,
గ్రచ్చఱ నొకనాఁడు కాననంబునను
హోమధేనువుఁ గాచుచుండంగఁ జూచి,
తామసులైనట్టి దానవులలిగి,

  1. విందమర. (మూ)