పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

ద్విపద భారతము.


"భార్గవ, యెప్పుడు బవరంబులోన
స్వర్గధీరులు మాకు జలదరింపుదురు.
నేఁడిదె దైత్యుల నిర్జరోత్తములు
పోఁడిమిఁజంపిరి పుణ్యాత్మ వారి
సంజీవనీమంత్ర సామర్థ్యమునను
సంజీవితులఁజేసి జయమిమ్ము మాకు ".
ననుచుఁ బ్రార్థన సేయ, నలరిశుక్రుండు
తనమంత్రశక్తిచే దనుజులఁగా చె.
ఈవిధంబున మఱి యీల్గురాక్షసుల
నేవెంట నాశుక్రుఁ డెలమిరక్షింప,
బ్రదికి దానవులెల్లఁ బ్రబలులై సురలఁ
బ్రిదులక చంపంగ, భీతులై వారు
తమకు సంజీవని తగులమిఁజేసి
తమసేనపొలియుట తర్కించిచూచి,
తమపురోహితునాజ్ఞఁ 'దత్పుత్రుఁ గచుని
[1]నమర నీమంత్రార్థ మర్థింత ' మనుచుఁ
గచుఁడున్న కడ కేఁగి, గారవంబొప్ప
నుచితంబుగావించి యొనరనిట్లనిరి:
"ఓమహాత్మక, నీవు యోగ్యవిప్రుండ ;
వేము మీశిష్యుల ; మిందువచ్చితిమి ;
శుక్రసంజీవనీ సురుచిరస్ఫూర్తి
విక్రాంతి దైత్యులు వెఱవరుమాకు ;
వారిచేఁదెగిన మా వరసేనలెల్లఁ
బోరిలోఁ బోయినపోకయైచనిరి ;
కావున, నీ వింకఁగౌశలంబొప్ప
నేవిధంబుననైన హితమాచరించి,

  1. అమరనిమంత్రంబు లందింతుమనుచు. (మూ)