పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

ద్విపద భారతము.


పరగఁ ద్రేతాయుగపరిణతిఁ దొల్లి
గురువధ నుగ్రుఁడై కువలయాధిపులఁ
బరశురాముఁడు తనపరశువుధార
నిరువదియొక్కమా ఱేరి చెండాడి,
[1]పేరిననెత్తుటఁ బితృతర్పణంబు
కోరినట్లనె చేసి కోపంబుమాని,
తెలిసి ధారుణియేడుదీవులు నపుడు
లలిమీఱ బ్రాహ్మణులకుధారవోసి
తపమున కేఁగంగ, దైన్యంబుతోడ
నృపుల భార్యలువచ్చి, నెఱిదిక్కు లేక
తడయుచు, [2]దాఁగుచు [3]దరిసి, కశ్యపునిఁ
బొడగాంచి వేడ్కఁ దత్సుణ్యున కెఱఁగి :
" పావకముఖములఁ బతులతోఁగూడఁ
బోవ మాకబ్బకపోయెఁ బూర్వమున ;
నింక నేగతిఁబోదు! మేదియాధార !
మంకిలిగాకుండ నానతియీవె!
కన్నుగానక క్రొవ్వి కార్తవీర్యుండు
పన్నినకలహంబు ఫలియించెమాకు. "
అనినఁ, గృపారాశియగు కశ్యపుండు
వనితలఁబలికెఁ దత్వము విచారించి :
“కులమునిల్పుటకంటెఁ గువలయాక్షులకుఁ
గలవె ధర్మంబులు కలకంఠులార !
తప్పులుపట్టక, దయ నేను మీకుఁ
జెప్పెదధర్మంబు చెవిదూర వినుఁడు.
వెరవొప్ప నిందఱు విప్రవీర్యంబు
ధరియింపఁగలరె సంతానసిద్ధికిని !

  1. పెరిగిన.
  2. తాకుచు.
  3. దడసి. (మూ)