పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము; ద్వితీయాశ్వాసము

111


ఏవగింపక సేయుఁ ; డిదిమహాధర్మ
మేవిధంబులయందు నే వినియుందు;
నేయుగంబునఁ జేయ రెవ్వారు మున్ను ;
నాయాజ్ఞ నిది మీరునడపుఁడు మేలు. "
అనుడు నమ్మునియాజ్ఞ యందఱుఁజేసి
తనయులఁగాంచ, నత్తనయు లింటింటఁ
బెరిగి విప్రులయాజ్ఞఁ బృథివి రక్షింపఁ,
బరఁగిన ధర్మప్రభావంబువలనఁ
గురిసె వర్షంబులు గోరినయట్లు ;
ధరణి సస్యములెల్ల ధాన్యమై [1]యొఱగెఁ;
బెల్లుగా మొదవులు పిదికెఁజన్నవిసి ;
కల్ల [2]పేదఱిమి రోగములస్తమించె;
నిరువురఁగూఁతుల నెనమండ్రసుతుల
నిరపాయులగువారి నెలఁతలు గనిరి;
పదివర్షములనాఁడె బ్రహ్మచారులకుఁ
జదువక ప్రాపించె సర్వవిద్యలుసు ;
ముదిసియు, నౌషధంబులలావువలన
వదలరుతఱుచు; చావరు మహీజనులు.
ధరలోన నగ్నిహోత్రములేని ద్విజుఁడుఁ,
బురుషునిఁబాసినపొలఁతియు లేదు.
వన్యధాన్యంబుల వనచరుల్ దనిసి,
సన్యసించిరి హింస జంతువులందు.
హరులును గరులు వాహనములుగాని,
నరవాహములులేవు [3]నరులమోయుటకు.
ఇట్టివైభవముల [4]నెనసి మానవులు
పుట్టయీనినయట్లు భూమిఁగ్రిక్కిఱియ,

  1. మెరిగి.
  2. పెదరమి.
  3. నరులు మోవమిని.
  4. నెంచి. (మూ)