పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము; ద్వితీయాశ్వాసము

109


తపమున కేఁగెద; దయతోడననుపుఁ ;
డపరిమితోత్సాహుఁడై యున్న వాఁడ.
మీనిమిత్తంబున మేనుసిద్ధించె;
నేనుజేసినపుణ్యమెల్ల మీసొమ్ము.
పలుమాఱు వేడ్కతోఁ బనిగల్గునపుడు
తలపుఁడు వచ్చెదఁదాత్పర్య మొప్ప; "
నని చెప్పి మ్రొక్కి , [1]హిమాద్రియవ్వలికిఁ
జనియె నాతఁడు దేవచక్రంబు పొగడ.
అట పరాశరుఁడును నయ్యేఱుదాటి,
కుటిల [2]కుంతలను వీడ్కొని వేగనరిగె.
ఆవిధమఃనఁ దప మయ్యద్రి నతఁడు
గావించి, మఱి పెక్కు కాలంబునకును
ఆదిమబ్రహ్మఁ బ్రత్యక్షంబుచేసి,
యా దేవుచే విద్యలన్నియునేర్చి,
యాదరంబున లెక్కకధికంబులైన
వేదంబు లొండొండ[3] విభజించి తీర్చి,
సారబంధంబుగా జనులకుఁ జదువ-
నేరవచ్చినసాటి నెఱి నాల్గుశ్రుతులు
విరచించి, పిదపఁగావించెభారతము
సరవి సపాదలక్షశ్లోకములను.
అంతట నది మాకు నానతియిచ్చె;
నింతయు నీకు నే నెఱిఁగింతు వినుము.
పంచాక్షరియుఁబోలెఁ బరఁగినకథను
బంచమవేదంబు పాయక వినినఁ,
బంచపాతకములుఁ బాయు భూనాథ!
పంచ [4]వక్త్రుండిచ్చుఁ బరమసంపదలు.

  1. హేమాద్రి.
  2. కుంతలిని
  3. విభగించి తిగిచి.
  4. వర్ణుండిచ్చు. (మూ)