పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

ద్విపద భారతము.


నమరనాయకభోజ్యమైనట్టి యమృత
మమరులు సాక్షిగా నర్థితోఁ దెచ్చి
యిచ్చితి నిదె మీకు; నింక మాతల్లి
నచ్చుగా దాసీత్ వమది పాసె నుష్ణ
కరహిమాంశులు గుఱిగాఁగ; మీ రిపుడు
కర మొప్ప స్నానాదికర్మముల్ దీర్చి
యొదవువేడుక నుపయోగింపు." డనుచు
ముదముతోఁ దమతల్లి మూఁపున నునిచి,
వినతులు సేసి, దర్వీకరారాతి
వినతఁ దోడ్కొని పోయె వినువీథి. నంతఁ,
గొనకొని యయ్యురగులు.[1]రోస ముడిగి,
[2]2 యనఘము లొక్కజలాశయమ్మున కేఁగి
స్నానంబు చేయ, నచ్చట ము న్నదృశ్యుఁ
డై నిల్చియున్న యయ్యమరనాయకుఁడు
సుధ యెత్తుకొనిపోయి, సురలలోఁ దొంటి
విధమున నునిచి ప్రవీణుఁడై యుండె.
అంత నాయురగు లయ్యమృత మచ్చోట
నంతయు వెదకి తా రటుగాన లేక,
యమృతకుంభస్థితి నమరినదర్భ
లమృతంబుమాఱుగా నందఱుఁ దలఁచి
నాఁడు దర్భలు నాక, నాసర్పములకు
[3]వాఁడిమై జిహ్వలు పాయగాఁ ద్రెవ్వి
చిరతరలీల ద్వజిహ్వలునాఁగఁ
బరఁగి; రమృతస్థితిఁ బరమపవిత్ర
మయ్యె దర్భయు ; విహగాధిపు డంత
నయ్యురగులఁ బాసి, యమృతాంబురాశి

  1. దొసుగు లుడిగి
  2. అనఘములు పన్నగులాయంబు కేగి
  3. పోడిగా జిహ్వలు పోలిగా ద్రెవ్వి. (మూ)