పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

ద్విపద భారతము


నెవ్వారలకుఁ గల్గు నిట్టిసామర్థ్య!
మెవ్వారలకుఁ గల్గు నీశక్తి పెంపు!
అమరుండ, వజితుండ, వజరుఁడ, వెందు
నమరుఁడవైన నీ కమృతమ దేల!
అమృతసేవకుల నాహవమున గెలిచి
క్రమమున విజయంబు గైకొన్న నీకు
నమృతాభిలాష లే ; దన్యులకొఱకు
దమకించి గొనిపోవఁదగదు పక్షీంద్ర !
ఇతరుల కీసుధ యిచ్చిన, వార
లతిబలవంతులై యమరసంఘముల
కరయఁ బోర నసాధ్యు లగుదురు; గానఁ,
దిరుగనిమ్మిది వైనతేయుఁడ, మాకు;
నీకు నిష్టావాప్తి నెఱనిత్తు." ననిన,
నాకౌశికునితోడ ననెఁ బక్షివిభుఁడు :
“అనఘ, మదీయాంబకైన దాసీత్వ
మనువుగా ననుపుదునని పన్నగులకు
'నమృతంబు దెచ్చిత్తు' నని పూని నొడివి,
క్రమముతో నమృతంబు గైకొంటి , దీని
నయ్యురగుల కిచ్చి యంబదాసీ[1]త్వ
మొయ్యనఁ బాపిన, నురగముల్ దీని
సేవింపకుండ శచీనాథ, మఱల
నీ వెత్తుకొని పొమ్ము నేర్పున." ననిన
గరుడనికడిమికిఁ గడుసంతసిల్లి,
పురుహూతుఁ డతని నింపునఁ జూచి పలికె:
'గరుడ, నీబలపరాక్రమములు వినఁగఁ
బరితోషమయ్యెడుఁ; బక్షీశ, తెలుపు'.

  1. 1. దాసీత్వ-చయ్యనఁ బాపిన సర్పముల్ దీని (మూ)