పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము; ద్వితీయాశ్వాసము

87


యనవుండు దయచేసి, హరి ఖగేశ్వరునిఁ :
“దనకు వాహనమవై ధ్వజమవై యుండు.'
మనుటయు, నతఁడు 'మహాప్రసాద'మని
వినతుఁడై లక్ష్మీశు వీడ్కొని పోవ,

గ రు త్మ దిం ద్రు ల మై త్రి



మగఁటిమి వాటించి మఱియు నింద్రుండు
ఖగపతిపై మదోత్కటవృత్తి వచ్చి
భిదురంబు వైవ, నాభీలరవంబు
లొదవంగ మండుచు నురవడి వచ్చి
గరుడనివక్ష ముగ్రతఁ దాఁకుటయును :

  • * * * * * * * * *

"నీ వెటు నను నొంప నేరవు; వినుము,
వావిరి మునిసంభవంబవు, నింద్రు
కైదువవును గానఁ, గడుఁజిన్నబుచ్చ
గాదు; కావున, నీవు కడఁగి మదేక
పర్ణంబు ద్రుంపు; దోర్బలశక్తి నే సు-
పర్ణుండఁ గాఁగ నీబలిమి యీపాటి
గాని లే", దనిన, నక్కడిభూతసమితి
మానుగా ఖగపతిమగఁటిమి చూచి,
[1].................................................
చెందినఁజూచి, శచీపతి యప్పు
డచ్చెరువడి పల్కె: “ననఘ, నీతోడ
నచ్చినవేడ్క మానక చెల్మిసేయ
నిష్టమయ్యెడు నాకు; నిట్టివిక్రమము,
శిష్టధీరత నీకుఁ జెల్లెఁగా; కెందు

  1. "అచటిభూతములెల్ల గరుడనిఱెక్కలబలిమి కచ్చెరువడి, యాతని 'సుపర్ణుఁ'డని
    పిలిచిరి" అను విషయము లుప్తమైయుండును.