పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

ద్విపద భారతము


భక్తలోకాధార, [1]ప్రణవస్వరూప,
నక్తంచరాంతక, నాగేంద్రవరద,
నీదయాదృష్టిచే నిఖిలలోకములు
ప్రోదియై నుతికెక్కి పొదలుచున్నవియు.
లోకంబులకు నీవు లోనుగానేర్తు;
లోకంబు లెల్ల నీలో నున్ననేర్తు;
వాదిదేవుఁడవు; సర్వాత్మైకపరుఁడ;
వాదట బ్రహ్మాదులైన నీమూర్తి
కనఁగ నెంతటివారు! కమలాధినాథ!”
అని సన్నుతించిన యావైనతేయుఁ
గనుఁగొని మనమున గారవం బార:
"వినతాతనూజ, నీవిక్రమక్రమము
లావును జవముఁ జలంబు సద్భావ
మేవలనను మేల; యెవ్వారు నిన్నుఁ
బోలరు మగఁటిమి బొంకుటగాదు;
మేలువరం బిత్తు మెచ్చితి నడుగు."
మని ప్రసన్నాతుఁడై యాన తిచ్చుటయు,
మనమునఁ బొంగి, సామజవరదునకు
వినతుఁడై కరములు వెరవొప్ప మొగిచి
తనర నిట్లనియె: "నీదయ నాకు నెపుడు
నమృతంబు గోరక యజరామరంబు
సముచితంబుగ నిచ్చి, సకలలోకముల
కగ్రణివైన నీయగ్రంబునం దు
దగ్రతేజత నిన్ను దయఁగొల్చియుండ
వరమిచ్చి కరుణింపు వరదయామూర్తి,
పరమకృపాలోల, భక్తవత్సలుఁడ! "

  1. ప్రణవానుకార (మూ )