పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; ద్వితీయాశ్వాసము

85


జల్లనిచూపుల సకలలోకులకుఁ
దల్లియై ప్రోచు పద్మాదేవి దనదు
వక్షస్థలంబున వరశుభోన్నతుల
సాక్షాత్కరించి ప్రసన్నత నిలువ,
దివ్యరత్నోజ్జ్వలదీప్తులతోడ
భవ్యమై కౌస్తుభాభరణంబు వెలుఁగ,
నొసవరిలాగున నొఱపైన మంచి
పసిఁడిచాయలచీర పసమీఱఁ గట్టి,
మహితప్రభావనిర్మలరత్నఖచిత
బహువిధాలంకారభానుప్రకాశ
వరపుష్పకం బెక్కి, వైభవోత్సాహ
తరసమగతి నొప్పు తనచిత్తమునకు
మెచ్చులు వొదలంగ మెఱసి యక్షేశుఁ
డిచ్చమై : “నవధారు హేవజ్రధీర ,
సకలలోకారాధ్య, సన్మునిస్తుత్య,
మకరాంగశతకోటిమహిత, పరాకు!
సందీప్తఘనచక్రసంహృతదనుజ,
యిందిరానాయక, హెచ్చరిక!' ననఁగ,
దేవదేవుఁడు సర్వదేవతామయుఁడు
వేవేగ నేతెంచి, విహగవల్లభున
కాదటఁ బ్రత్యక్షమై నిల్చునంత,
నా దేవదేవు శుభాకృతి భక్తి
భావించి పులకించి ప్రమదంబుతోడ :
.........................................
"పద్మాలయసద్మ, పద్మపత్రాక్ష ,
పద్మజవినుత, సద్భావనాతీత,
సత్యస్వరూప, నిశ్చలతత్వరూప,

నిత్యనిరాలంబ, నిర్వాణనిపుణ