పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

ద్విపద భారతము


గలిగి త న్నటుపోవఁగానీగయునికి
దెలిసి, దక్షిణవార్థి దివ్యజలంబు
పుక్కిటఁ గొనివచ్చి పోసి చిచ్చార్చి ,
తక్కక చని, తీక్ష్ణ[1]ధారమై దేవ
కల్పితంబైన చక్రంబురంధ్రమున
నల్పాంగుఁడై చొచ్చి, యట మహాఘోర
గరళాగ్నికీలసంఘటితవిస్ఫురణ
నరుణరుణాక్షివిధాగ్నులఁ జూపు
మాత్రనె పరుల భస్మముసేయు నుగ్ర
గాత్రమై యతిభయంకరలీలనున్న
భుజగయుగంబును బొడగాంచి, తనదు
నిజపక్షయుగముచే నేత్రముల్ గప్పి,
నలిరేఁగి వానిఫణంబులు ద్రొక్కి,
చెలఁగుచు నమృతంబు చేకొని వెడలి,
దివికి లంఘించి యుద్దీప్తబలుండు
దివిజులనెల్లను దృణలీల గెలిచి

విష్ణువు గరుడు ననుగ్రహించుట



పోవుచో, నప్పు డంభోరుహనాభుఁ
డావైనతేయు పరాక్రమశక్తి
కెంతయుఁ బ్రియమంది, యిచ్చలో నతని
సంతతసత్కటాక్షంబున నునుపఁ
దలఁచి, సన్మునులు బృందారకానీక
ములు సందడింపుచు ముందఱనడువ ,
వాణీశ్వరుండు గీర్వాణేశ్వరుండు
రాణింప నుభయపార్శ్వంబుల నడువఁ,

  1. ధామమై వేగ (మూ)