పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; ద్వితీయాశ్వాసము

83


వరుస మహావేగవాయువేగమునఁ
బరతేరఁ, దత్సుధాపాలురు భీతిఁ
గలగుచుఁ బాఱిపోగమకించి, నిలిచి
బలపరాక్రముఁడైన పక్షీంద్రుఁ గనిరి.
కని యనల్పక్రోధగర్వులై తాకి,
పనుగొని నిశితాస్త్రపంక్తులు దాల్చి
తడఁబడనేసియుఁ, దాఁకనేసియును,

  • * * * * * * * * * *

మొత్తియు, నొత్తియు, ముసలఘాతముల
నొత్తియుఁ, దాఁచియు, నుదరితాఁకియును,
ధట్టించియును మహోద్ధతి నిట్లుపోరు
నట్టినిలింపుల నరవాయిగొనక,
పక్షవిక్షేపణ[1]ప్రనృతరేణువులఁ
జక్షులఁ గప్పి, చంచల మందఁజేసి,
విదితకోపోద్రేకవిస్ఫులింగములఁ
బదనఖతుండాగ్రపక్షఘట్టనలఁ
గనుకని రక్త మంగంబులఁ దొరుఁగ
దనువులు చించి, యుద్ధతి వ్రక్కలింప,
నమరులు, వసువులు, యక్షకిన్నరులుఁ,
గమలబాంధవులు, నేకాదశరుద్రు
లందఱు నొక్కట నాజి చాలించి
యందంద పాఱిన, నట పక్షివిభుఁడు
సమరకేళీలోలచతురుఁడై యప్పు
డమృతంబుకడ కేఁగి, యచ్చట ఘోర
తరసమీరణప్రేరితంబైన యగ్ని
దరికొని మిన్నులుదాఁకెడిశిఖలు

  1. ప్రసవ (మూ )