పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

ద్విపద భారతము


చలియింప నురపడి జరణంబు లూఁది,
బలువిడి గంపింపఁ బద్మజాండమ్ము
భల్లున నవియ భూభాగంబులద్రువఁ
దల్లడించుచు జీవతతియెల్లఁ దూల
నురవడి మింటికి నుప్పరం బెగసి,
కరువలికంటె వేగమె పోవుచుండ,
నప్పు డాసురపురియందు నెల్లెడలఁ
దప్పక దుర్నిమిత్తంబులు దోప,
వెఱఁగంది ధిషణు రావించి యింద్రుండు :
'సరవి నుత్పాతసూచనకుఁ గారణము
నెఱిఁగింపు.' డన మతినెఱిఁగి యాగురుఁడు
తెఱఁగొప్పఁ బలికె నాదేవేంద్రుతోడ :
“శతమఖ, విమము; కశ్యపువరంబునను
నుతకీర్తి వినతాతనూజాతుఁ డగుచు
జలనిధిలోనున్న శబరుల నెల్లఁ
గలగొని మ్రింగి, యాగజకచ్ఛపముల
నొక్కక్కట మెసవి, మహోగ్రతేజమునఁ
జక్కనఁ దల్లిదాస్యం బెడఁబాపు
కొఱకునై, యురగముఖ్యుల కమృతంబు
తెఱఁగొప్పఁ గొనిపోవఁ దివిఱి యిచ్చటికి
వచ్చుచునున్నాఁడు వైనతేయుండు.

  • * * * * * * * * *

నీకు నసాధ్యుండు నిర్జరనాథ,
కైకొని నీవు నగ్గరుఁడనిమహిమ

గ రుడ నిమహిమ



యెఱుఁగుదు; వెట్లన్న నెఱిఁగింతు వినుము.

వఱలంగఁ దొల్లి భవన్ముఖ్యదేవ